జనసేనకు బకెట్ గుర్తు టెన్షన్.. ఎన్నికల బరిలో పవన్ కల్యాణ్, మనోహర్ పేర్లతో ఉన్న అభ్యర్థులు!

  • ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్న జనసేన
  • కామన్ సింబల్స్ లో బకెట్ గుర్తును చేర్చిన ఎన్నికల సంఘం
  • బకెట్ సింబల్ తో బరిలోకి దిగిన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ... ఒక విషయం ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే బకెట్ గుర్తు. కామన్ సింబల్స్ లో ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కూడా కేటాయించింది. 

ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నేతల పేర్లతో ఉన్న వారు బకెట్ సింబల్ తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బకెట్ గుర్తు అచ్చం జనసేన గుర్తు గాజు గ్లాసును పోలి ఉంది. నవరంగ్ కాంగ్రెస్ అనే ఓ పార్టీ బకెట్ సింబల్ తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. పిఠాపురంలో కె. పవన్ కల్యాణ్, తెనాలిలో ఎన్. మనోహర్, మచిలీపట్నం ఎంబీ అభ్యర్థిగా బాలశౌరి అనే అభ్యర్థులను బరిలోకి దించింది. జనసేనకు ఓటు వేసే ఓటర్లు ఈ గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే.

Bucket Symbol
Jana Reddy
Glass Symbol

More Telugu News